MLG: గోవిందరావుపేటలో జూన్ 3 నుంచి 12 వరకు నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణ తరగతుల పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాల పెంపే లక్ష్యంగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.