JGL: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. రాయికల్ మండలంలోని మైతాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, శివమణి రైస్ మిల్లును శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.