MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ లో దుర్గకుమార్ (9) అదృశ్యమైనట్టు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన భగీరథ గోస్వామి, రాధాదేవి దంపతులు పరికిబండలో నివాసం ఉంటున్నారు. కుమారుడు దుర్గా కుమార్ పనులు చేయకపోవడంతో 25న మందలించారు. దంపతులు పనులకు వెళ్ళగా ఇంటి వద్ద ఉన్న దుర్గా కుమార్ ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయాడు.