TG: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆలం ఖాన్‌పై అధిష్ఠానం తీవ్ర చర్యలు తీసుకుంది. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, నేరపూరిత చర్యలకు పాల్పడినా సహించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.