AP: ఏడాది పాటు భారీ నిర్మాణాలను వాయిదా వేయాలని ప్రధాని మోదీ సూచించినా.. అమరావతి రాజధాని కావడంతో నిర్మాణం కొనసాగిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. క్యాపిటల్ నిర్మాణానికి ఎలాంటి డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అమరావతి కోసం 28 వేల మంది రైతులు భూములిచ్చారని, నిర్మాణం ఆపేస్తే వారంతా ఇబ్బంది పడతారని.. అందుకే నిర్మాణ పనులను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.