ఏలూరులో పాఠశాల బస్సులను శుక్రవారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏలూరు డీటీసీ కరీం ఆధ్వర్యంలో పాఠశాల బస్సులకు నిర్దేశించిన నిబంధనలకు లోబడి బస్సులు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో ఐదు బృందాలు పాల్గొన్నాయని ఇప్పటికే నిబంధనలు పాటించనీ 652 బస్సులకు నోటీసులు ఇచ్చామన్నారు.