W.G: పెదఅమిరంలో శుక్రవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రజా క్షేమం కోసమేనన్నారు. కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని, కోర్టు ఆదేశాల ప్రకారమే ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలిపారు. దళితులు వెనుకబడిన వారి ఇళ్లను కూల్చివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.