TG: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొయిజుద్దీన్‌ను చంపేందుకు రూ.25 లక్షల సుపారీ ఇచ్చిన ప్రధాన నిందితుడు ఆలంఖాన్‌తో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు వివిధ ప్రాంతాలకు పారిపోయారని, ఇప్పటివరకు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.