ADB: మావల మండలం బట్టిసావర్గం శివారులో జరుగుతున్న ఉపాధి పనులను సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కూలీలకు పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు వెంటనే డబ్బులు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రజిని, టీఏ మాధురి, ఫీల్డ్ అసిస్టెంట్ రవి పాల్గొన్నారు.