ముడిసరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కోల్గేట్-పామోలివ్ ఇండియా తమ టూత్పేస్ట్ల ధరలను 4 నుంచి 5 శాతం పెంచింది. ముఖ్యంగా మ్యాక్స్ ఫ్రెష్, డెంటల్ క్రీమ్, విజిబుల్ వైట్ వంటి ప్రముఖ రకాలపై ఈ ప్రభావం పడింది. అయితే సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే తక్కువ ధర కలిగిన ప్యాకెట్ల ధరలను మాత్రం ప్రస్తుతానికి పెంచలేదు.