ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా (69), యాస్తికా (54) చెలరేగడంతో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 150 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో నందని శర్మ 3, క్రాంతి గౌడ్ 2 వికెట్లు పడగొట్టారు.