రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వరుసగా ఆరో ఏడాదీ కంపెనీ నుంచి ఎటువంటి జీతం తీసుకోలేదు. కోవిడ్ సమయంలో స్వచ్ఛందంగా జీతాన్ని వదులుకున్న ఆయన, ఈ నిర్ణయాన్ని 2025-26లోనూ కొనసాగించారు. షేర్లపై వచ్చే డివిడెండ్లే ఆయనకు ప్రధాన ఆదాయ వనరు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రూ.95,754 కోట్ల రికార్డు నికర లాభాన్ని సాధించడం విశేషం.