కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండా ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీడీ విజయలక్ష్మి గురువారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.