JN: జనగామ పట్టణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కొన్నే మహేందర్ రెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి (10) ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో పట్టణ కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.