కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహ స్వామివారి నిత్య అన్నదానం ట్రస్టుకు సామర్లకోటకు చెందిన N. సుధాకర్ రెడ్డి, కరుణకుమారి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందించారు. ఈ నగదును గురువారం ఆలయ ఉద్యోగులకు అందజేశారు. దాత దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో నాగ ప్రసాద్ స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.