MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో భానోత్ రవిచందర్, వేల్పుగొండ ప్రకాష్, మేకల రాధా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.