AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఇవాళ అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీలు, 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు 52 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సూచించింది.