TG: దేశచరిత్రలో స్ఫూర్తిదాయక నేతలుగా ముగ్గురు జతిరత్నాలు ఉన్నారని సీఎం రేవంత్ అన్నారు. ‘మొదటివ్యక్తి.. అందరికీ సమాన ఓటు హక్కు ఇచ్చిన అంబేద్కర్. రెండో వ్యక్తి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. మూడోతరంలో ఎన్టీఆర్. నీతి నిజాయతీ, ఉక్కు సంకల్పంతో పనిచేసిన వ్యక్తి ఆయన. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు.. తెలుగు జాతికి స్ఫూర్తి నింపిన నాయకుడు ఎన్టీఆర్’ అని కొనియాడారు.