నల్గొండ రూరల్ ఠాణాను ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. స్టేషన్లో నిర్వహిస్తున్న క్రైమ్ రికార్డులు, రికవరీ చేసిన ప్రాపర్టీలు, సీజ్ చేసిన వాహనాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.