NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని జూన్ 5 నుంచి పునఃప్రారంభించేందుకు ఇంద్రకీలాద్రి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టింది. ఈవో శీనా నాయక్ అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, జూన్ 2లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా నవహారతులను ఘనంగా నిర్వహించాలని సూచించారు.