అన్నమయ్య: రాయచోటి మండలం మాధవరం గ్రామ సచివాలయం ప్రాంగణంలోని రైతు సేవా కేంద్రం గోడకు అమర్చిన శిలాఫలకాన్ని పగలగొట్టిన కేసులో షేక్ బిలవున్ (22)ను రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో తానే శిలాఫలకాన్ని ధ్వంసం చేసి, TDP కార్యకర్తలపై తప్పుడు ప్రచారం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.