MDK: తూప్రాన్ టోల్ ప్లాజా సమీపంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుహాసిని తెలిపారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.