నెల్లూరు: ముసునూరు టోల్ ప్లాజా సమీపంలోని జాతీయ రహదారిపై ఉబ్బలవాగు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో పల్సర్ బైక్ నడిపిన వ్యక్తి రోడ్డు పక్కన ప్లాస్టిక్ కాగితాలు ఏరుకుంటున్న గౌరవరం గ్రామానికి చెందిన యాదగిరి కోటయ్యను బలంగా ఢీకొట్టాడు. ఢీకొన్న వేగానికి కోటయ్య డివైడర్ అవతలికి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.