కరీంనగర్ రేకుర్తి ఈద్గాలో బక్రీద్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించగా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.