PLD: కోటప్పకొండ రోడ్డులోని చీకటి కాలనీలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పూరి గుడిసెల బాధితులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. రెడ్ క్రాస్ సహకారంతో తార్పాలిన్ షీట్లు పంపిణీ చేసి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.