MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బక్రీద్ పురస్కరించుకుని లక్షెట్టిపేట పట్టణంతో పాటు పలు గ్రామాల శివారులలో ఉన్న ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రేమకు, త్యాగానికి సోదర భావానికి బక్రీద్ పండుగ ప్రత్యేకగా నిలుస్తుందన్నారు. అనంతరం బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.