NRML: హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జనగణనలో అత్యంత కీలకమైన ఘట్టమని, దీనిని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సిబ్బందికి కేటాయించిన లక్ష్యాలు, ఇప్పటివరకు పూర్తయిన ఇళ్ల వివరాలను ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అడిగి వాకబు చేశారు.