ఏలూరు మార్కెట్లో నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల వ్యవధిలో 50 కిలోల బస్తా ధర రూ.8,500 నుంచి 3,500కు పతనమైంది. ఇతర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ముంబయి, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతులు తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర రాక తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.