E.G: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కోరుకొండలోని MLA కార్యాలయంలో పలు సమస్యలపై ప్రజలను ఎమ్మెల్యే ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన క్షేత్రస్థాయి పరిశీలన జరిపి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.