కాకినాడ: వేట్లపాలెం దుర్ఘటన నేపథ్యంలో సస్పెండైన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుపై ఉన్న సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఇదే కేసులో సస్పెండైన ఆర్డీవో శ్రీరమణిపై వేటును గత నెలలోనే తొలగించగా, తాజాగా డీఎస్పీపై కూడా సస్పెన్షన్ తొలగించి ఆయనను అమరావతి SBకి అటాచ్ చేశారు. శ్రీహరిరాజుపై సస్పెన్షన్ వేటు తొలగించడం పట్ల పలువురు పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.