SDPT: జిల్లా కలెక్టర్ కె. హైమావతి, చేర్యాల మండలం వీరన్నపేట గ్రామంలోని శివ సాయి బాలాజీ రైస్ మిల్, ముస్యాల గ్రామ శివారులోని శ్రీ రేణుక బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీలను సందర్శించి, మిల్లులలో వరిధాన్యం దిగుమతి ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మిల్లర్ యజమానులను ఆదేశించారు. మిల్లులలో దాదాపు 30 వాహనాల ధాన్యం దిగుమతికి సిద్ధంగా ఉందన్నారు.