BHPL: జిల్లాకు రైల్వే లైన్ మంజూరు చేయాలని జిల్లా ప్రజలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగరేణి బొగ్గు రవాణా ప్రస్తుతం ట్రక్కుల ద్వారానే జరుగుతుండటంతో రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.