KMM: అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సూచించారు. కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో కొత్త పేర్ల నమోదు, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపు, వివరాల సవరణలపై చర్చించారు. ఎన్నికల కమిషన్ నియమాలు పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.