నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేశ్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని అరుదైన కళాఖండాన్ని రూపొందించారు. “NTR” అక్షరాలలో ఎన్టీఆర్ వివిధ పాత్రలతో కూడిన 20 చిత్రాలను కేవలం 8 అంగుళాల పొడవు,14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్‌పై మైక్రో పెన్నులు,మైక్రో బ్రష్‌లు,వాటర్ కలర్స్‌తో అద్భుతంగా చిత్రించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.