PLD: బెల్లంకొండ శివారులోని భీముని దిబ్బ కొండ అటవీ ప్రాంతంలో బుధవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దొరికింది. అడవిలో గొర్రెలు మేపుతున్న కాపరులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, ఆయన 15 రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.