MDCL: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కోసం లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్‌ను ఉపయోగించుకోవాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్ అన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను బుధవారం ప్రారంభించారు. ఖైదీలకు మరింత మెరుగైన న్యాయసేవలందించాలనే సంకల్పంతోనే ఈ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.