HYD: కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత సోదరుడు హబీబ్ పాషాను హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను రైన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాకుత్‌పురాకు చెందిన రోటీ మేకర్ మహ్మద్ ఫారూక్ పాషా(21), తన స్నేహితుడు షేక్ అబ్దుల్ కరీం(26) సహాయంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.