HYD: నోటిలో రెండు వారాలకు మించి మానని పుండ్లు, నాలుక లేదా బుగ్గలపై తెలుపు, ఎరుపు మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని HYD ఎంఎన్జే వైద్యులు సూచిస్తున్నారు. నోటిలో గడ్డలు, చెవి నొప్పి, గొంతు బొంగురు పోవడం, నాలుక లేదా దవడ కదలికలో ఇబ్బంది వంటి లక్షణాలు నోటి క్యాన్సర్కు హెచ్చరిక సంకేతాలై ఉండొచ్చని తెలిపారు.