E.G: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగు నీటి ప్రవాహాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. గోదావరిలోకి మురుగు నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు.