TG: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్దఎత్తున ఆందోళన చేపడతామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై వేయొద్దని కేంద్రాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో కొనుగోలు చేయాలని సూచించారు. సింగరేణిలో నష్టాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.