NLG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. పాలీబ్యాగ్లలో సంరక్షణతో పెంచుతున్న ఈ మొక్కలు భవిష్యత్లో జిల్లాలోని గ్రామాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పచ్చదనంతో నింపనున్నాయి. హరితహారం కార్యక్రమానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు.