KDP: జమ్మలమడుగులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పరిశీలకురాలు రామసుబ్బమ్మతో పాటు పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి టీడీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.