అన్నమయ్య: రాయచోటి డివిజనల్ DYSO రామ్మోహన్ నాయక్ బుధవారం డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. మొత్తం 196.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. రాయచోటిలో అత్యధికంగా 54.6 మి.మీ, చిన్నమండెంలో 48.4 మి.మీ, గాలివీడులో 32.2 మి.మీ, రామాపురంలో 26.2 మి.మీ, లక్కిరెడ్డిపల్లిలో 24.6 మి.మీ నమోదైనట్లు పేర్కొన్నారు.