అన్నమయ్య: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు మాజీ కౌన్సిలర్ జానం రవి, 25వ వార్డు మాజీ కౌన్సిలర్ సయ్యద్ రియాజ్ YCPని వీడి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం TDPలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై TDPలో చేరుతున్నామన్నారు.