సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి కుల్వంత్ హాల్లో ఒడిశాకు చెందిన వెయ్యి మందికి పైగా శ్రీ సత్యసాయి బాలా వికాస్ పిల్లలు, గురువులు, తల్లిదండ్రుల పార్థి యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా పిల్లలు వేద పఠనం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థిని, ప్రస్తుత విద్యార్థి ప్రసంగించారు. తర్వాత విద్యార్థులు ఆలపించిన పలు భక్తి గీతాలు, స్వామి భజనలు భక్తులను అలరించాయి.