ATP: గుంతకల్లులోని ఎస్.ఎస్. ట్యాంక్ (S.S. Tank) కట్టలు, నీటి సరఫరా వ్యవస్థను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ ఎస్ ట్యాంక్ పరిసర ప్రాంతాలలో తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలకు హెచ్చరించారు. ప్రజలకు శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశించారు.