NDL: కొలిమిగుండ్ల మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఇవాళ సీఐ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రహదారులు, ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాల వద్ద మద్యం సేవించకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ రమేష్ బాబు హెచ్చరించారు.