KDP: ములకలచెరువు(M) దేవలచెరువు పంచాయతీ మామిడిగుంపులపల్లెలో దారి వివాదం తలెత్తి ఓ రైతుపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన శేషాద్రిరెడ్డి(50)కి, నారాయణరెడ్డి వర్గానికి దారి విషయమై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం శేషాద్రిరెడ్డి పొలానికి వెళుతుండగా, నారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకుని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.