కోనసీమ: కె.జగన్నాథపురంలో రూ.45 లక్షలతో నిర్మించిన షెడ్లను రాజకీయ కక్షతో కూల్చేశారని YCP అయినవల్లి మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఉషారాణి ఆరోపించారు. తాడేపల్లిలో మంగళవారం పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారు మాజీ సీఎం జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని, పార్టీ వెన్నంటి ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.