ATP: హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు పెండింగ్ పరిహారం వెంటనే విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కడపం దామోదర్ అధికారులను కోరారు. HNSS కార్యాలయంలో అధికారులను కలిసి సమస్యను వివరించారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందిస్తూ త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.